సల్మాన్ కు ఐదోసారి బెదిరింపులు
Threats to Salman for the fifth time
సికిందర్ పాటరాసిన వారిని వదలబోం
రూ. 5 కోట్లిస్తే వదిలేస్తాం
కర్ణాటక నుంచి బెదిరింపు కాల్
బెదిరింపులపై పోలీసుల హెచ్చిరికలు
ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. గురువారం అర్థరాత్రి 12 గంటలకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు బాంద్రా పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఐదోసారి బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రంలో ఓ పాటను రాసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. రూ. 5 కోట్లు ఇస్తే వివాదం పూర్తిగా సమసిపోతుందన్నారు.
సల్మాన్ కు ఎవరు సహాయం చేసిన వారినీ వదలబోమన్నారు. కాగా బెదిరింపు కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్లు బాంద్రా పోలీసులు గుర్తించారు. వెంకటేష్ దాస్ అనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించి పోలీసుల బృందం కర్ణాటక బయలుదేరింది. ఈ విషయాన్ని కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు.
కాగా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ముంబాయి పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. సరదా కోసం, భయబ్రాంతులకు గురిచేసేందుకు, పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫోన్ కాల్స్, బెదిరింపులను సహించబోమన్నారు.
సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.