జమ్మూకశ్మీర్​ లో 11 జిల్లాల్లో మైనస్​ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

17 రాష్ట్రాల్లో చలితీవ్రత, 77 రైళ్లు రద్దు

Dec 7, 2024 - 13:32
 0
జమ్మూకశ్మీర్​ లో 11 జిల్లాల్లో మైనస్​ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్​ లో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శనివారం 11 జిల్లాల్లో మైనస్​ డిగ్రీల సెల్సీయస్​ గా నమోదైంది. జమ్మూకశ్మీర్​ తోపాటు 17 రాష్ట్రాల్లో పొగమంచు కురుస్తుంది. 77 రైళ్లను రద్దు చేశారు. జమ్మూలోని రెండు జిల్లాలు, కశ్మీర్​ లోని తొమ్మిది జిల్లాల్లో ఉష్ణోగ్రతల్​ లు మైనస్​ లో నమోదవుతున్నాయి. జోజిలాలో అత్యల్పంగా –19 డిగ్రీలకు చేరుకుంది. పోషియాన్​ లో –4.5, పహల్గామ్, బందిపోరాలో –-4.3 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్‌లోని ఆడమ్‌పూర్ –3.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతతో సీజన్‌లో అత్యంత చలి నమోదైంది. దీంతో ఉత్తర రైల్వే ఫిబ్రవరి 28వ తేదీవరకు 77 రైళ్లను రద్దు చేసింది. డిసెంబర్ 8,-9 తేదీలలో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, అసోం, సిక్కిం, మేఘాలయ, త్రిపుర సహా 17 రాష్ట్రాల్లో మంచు కురుస్తుంది. దీంతో మైదాన రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది.