మెడికో హత్య పోలీసులు, ప్రభుత్వం తీరుపై సుప్రీం మండిపాటు

Supreme indignation over the police and government's behavior in Medico's murder

Aug 20, 2024 - 14:22
 0
మెడికో హత్య పోలీసులు, ప్రభుత్వం తీరుపై సుప్రీం మండిపాటు

9మందితో భద్రత కమిటీ ఏర్పాటు
కమిటీలో కేంద్రం నుంచి మరో ఐదుగురు సభ్యులు
22లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని పోలీసులు, ప్రభుత్వానికి ఆదేశం
ఆగస్ట్ 22కు విచారణ వాయిదా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కోల్​ కతా ఆర్జీకర్​ మెడికో అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ప్రభుత్వం, కళాశాల ప్రిన్సిపాల్​, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించిన సుప్రీం సీజేఐ చంద్రచూడ్​ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా లు కేసును విచారించారు. 

భద్రతపై టాస్క్​ ఫోర్స్​..

ఈ సందర్భంగా న్యాయమూర్తులు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం సుప్రీం నేతృత్వంలోని 9మందితో కూడిన టాస్క్ ఫోర్స్​ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టాస్క్​ ఫోర్స్​ లో ఆర్​ కే. సరియన్​, సర్జన్​, డా. నాగేశ్వర్​ రెడ్డి, మేనేజ్​ మెంట్​ డైరెక్టర్​ ఏషియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ నేషనల్​ గ్యాస్ర్టోలాజీ (తెలంగాణ), డా. ఎం. శ్రీనివాస్​, డైరెక్టర్​ ఏయిమ్స్​ న్యూ ఢిల్లీ, డా. ప్రతిమా మూర్తి ఎన్​ ఐఎంహెచ్​ ఎఎన్​ ఎస్​ (బెంగళూరు), డా. గోవర్ధన్​ దత్​ పూరి, డైరెక్టర్​ ఎయిమ్స్​ (జోధ్​ పూర్​), డా. సౌమిత్రి రావత్​, గంగారామ్​ ఆసుపత్రి మేనేజింగ్​ సభ్యురాలు, ప్రొఫెసర్​ అనితా సక్సేనా, కార్డియాలజీ, ఎయిమ్స్​ (న్యూ ఢిల్లీ), ప్రొఫెసర్​ పల్లవి సాప్రే, గ్రాంట్​ మెడికల్​ కాలేజీ డీన్​ (ముంబై),  డా. పద్మా శ్రీవాస్తవ్​, న్యూరోజలాజీ డిపార్ట్​ మెంట్​ ఎయిమ్స్​.

వీరితోపాటు ఈ టాస్క్​ ఫోర్స్​ లో మరో ఐదుగురు ఉండనున్నారు. కేంద్ర కేబినెట్​, హోంశాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ మెడికల్​ కమిషన్​ అధ్యక్షులు, నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినర్​ అధ్యక్షులు ఈ టాస్క్​ ఫోర్స్​ లో ఉండనున్నారు. కాగా ఈ నిర్ణయాన్ని ఫెమా (ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా మెడికల్​ ఎసోసియేషన్​) స్వాగతించింది. 

ఈ టాస్క్​ ఫోర్స్​ మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక, రెండు నెలల్లోగా తుది నివేదికను అందజేయాలని సుప్రీం తెలిపింది. 

మండిపాటు..

ఆర్జీకర్​ ప్రిన్సిపాల్​ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఘటన జరగడం దురదృష్టమని పేర్కొంది. ఈ ఘటనను ప్రిన్సిపాల్​ ఆత్మహత్యగా ఎలా చెప్పారని మండిపడింది. బాధితురాలి ఫోటోలు, పేరును మీడియా ఎలా ప్రచురించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్​ తీరుపై అనుమానాలు ఉన్నప్పుడు మరో కళాశాలలో ఎలా నియమించారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక కాలేజీలో సాక్ష్యాల తారుమారు జరుగుతున్న ఆరోపణలపై పోలీసులు ఏం చేశారని? ప్రశ్నించింది.  మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించడంలో ఎందుకు ఆలస్యం చోటు చేసుకుందని ప్రశ్నించింది. ఈ దర్యాప్తు స్టేటస్​ రిపోర్ట్​ ను ఆగస్ట్​ 22 కల్లా సుప్రీంకు సమర్పించాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. 

పనిప్రదేశంలో మహిళలకు భద్రత, సమానత్వం లేకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఎంతోమంది వైద్యులు దేశ ప్రజల మానప్రాణాలను కాపాడేందుకు అహార్నిశలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. బాధ, ఆవేశం, ఆక్రోశంతో నిరసన, ఆందోళనకు దిగిన వైద్యులపై ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని తప్పుబట్టింది. శాంతియుత ఆందోళనలపై ఆజామాయిషీ చూపించొద్దని బలప్రయోగానికి తెరతీయొద్దని స్పష్టం చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని పేర్కొంది. అదే సమయంలో శాంతిభద్రతలు, సాక్ష్యాలను కాపాడాల్సిన బాధ్యత రాష్​ర్ట ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  కేసును ఆగస్ట్​ 22కి వాయిదా వేసింది.