అజిత్ దే ఎన్సీపీ: ఈసీ!
ఎన్సీపీ పార్టీ అజిత్ గ్రూప్ దేనని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
ముంబై: ఎన్సీపీ పార్టీ అజిత్ గ్రూప్ దేనని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దీంతో శరద్ పవార్ కు షాక్ తగిలినట్లయింది. అన్ని ఆధారాలను దృష్టిలో తీసుకునే నిర్ణయం తీసుకున్నామని ఈసీ పేర్కొంది. పార్టీ పేరు, గుర్తును అజిత్ పవర్ వర్గం వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. కొత్త పార్టీ ఏర్పాటుకు ముగ్గురి పేర్లను ఇవ్వాలని ఈసీ శరద్ పవార్ ను కోరింది. శరద్, అజిత్ ల మధ్య ఆరు నెలలకు పైగా సాగిన ఉత్కంఠకు ఈసీ తెరదించింది. అయితే అజిత్ పవార్ వర్గందే ఎన్సీపీ అని ఈసీ ఎలా నిర్ణయించిందనే దానికి సమాధానమిచ్చింది. పార్టీలో ఉన్న మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను తొలి ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది. అదే సమయంలో పలుమార్లు శరద్ వర్గానికి కూడా సమయం కేటాయించినా ఆయన తన బలాన్ని, మెజార్టీని నిరూపించుకోలేకపోయారని పేర్కొంది.