నేటి నుంచి అమల్లోకి ట్రాయ్​ మెసేజ్​ ట్రేసేబిలిటీ!

Troy Message Traceability in effect from today!

Dec 11, 2024 - 13:27
 0
నేటి నుంచి అమల్లోకి ట్రాయ్​ మెసేజ్​ ట్రేసేబిలిటీ!

ఇక మోసాల మేసేజ్​ లకు కత్తెర
ట్రాయ్​ ప్రతిపాదనలు అమల్లోకి 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ట్రాయ్​ మెసేజ్​ ట్రేసేబిలిటీ బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. దీని ద్వారా భారత్​ లో మొబైల్​ వాడుతున్న 120 మంది వినియోగదారులకు మేలు చేకూరనుంది. మొబైల్​ వినియోగదారుల సురక్షితం కోసమే ట్రాయ్​ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. గతంలో రెండుసార్లు అమలు ప్రతిపాదన ఆలస్యం జరిగినా ఎట్టకేలకు డిసెంబర్​ 11 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఎస్​ ఎంఎస్​ ల ద్వారా మోసాలను టెలికాం రెగ్యులేటరీ పూర్తిగా నిరోధించనుంది. ట్రాయ్​ సిఫార్సు చేసిన ఈ ప్రతిపాదన ద్వారా మెసేజ్​ ఎక్కడి నుంచి వస్తుందన్నది గుర్తించొచ్చు. దీంతో వినియోగదారులు మోసపోయేందుకు ఆస్కారం ఉండదు. ఇలాంటి సందేశాలను వెంటనే టెలికాం రెగ్యులేటరీ, ఆయా మొబైల్​ సంస్థలు పూర్తిగా బ్లాక్​ చేయనున్నారు. ఇప్పటికే ఆన్​ లైన్​ మోసాలు భారీగా పెరగడంతో ట్రాయ్​ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మెసేజ్​, మోసాలకు పాల్పడేవారి ఫోన్ నంబర్లు, కాల్స్​ ను పూర్తిగా బ్లాక్​ చేయనున్నారు. జియో, ఎయిర్​ టెల్​, వోడాఫోన్​, బీఎస్​ ఎన్​ ఎల్​ లు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. నవంబర్​ 30 నాటికి 27వేల సంస్థలు మెసేజ్​ ట్రేసేబిలిటీ కింద టెలికామ్​ ఆపరేటర్ల వద్ద తమ రిజిస్ర్టేషన్‌లను నమోదు చేసుకున్నాయి. మిగిలిన సంస్థలు కూడా ఈ పనిలో ఉన్నాయి. భారత్​ లో ప్రతీయేటా 1.5 నుంచి 1.7 బిలియన్ల మెసేజ్​ లు వినియోగదారులకు వస్తున్నాయి. నూతన నిబంధనలను ప్రతిపాదించడంతో కేవలం సురక్షితమైన రిజిస్టరైన సందేశాలు మాత్రమే వినియోగదారులకు రానున్నాయి. నమోదుకాని సంస్థల నుంచి వచ్చే సందేశాలను టెలికామ్​ ఆపరేటర్లే బ్లాక్​ చేయనున్నారు.