జమ్మూపై దృష్టేది
రాహుల్ పై ఒమర్ అసహానం
శ్రీనగర్: ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు కూటమి పార్టీల మధ్య అసహనాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఎన్సీ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కశ్మీర్ లో ప్రాధాన్యత తగ్గించి జమ్మూలో ప్రాధాన్యత పెంచాలన్నారు. కశ్మీర్ లో కాంగ్రెస్ ఏం చేయగలుగుతుందనేది ముఖ్యం కాదని, జమ్మూలో ఏం చేస్తుందనేదే ముఖ్యమన్నారు. దురదృష్టం కొద్దీ జమ్మూలో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించడం లేదని విమర్శించారు. ఇంకా ఐదు రోజులు మాత్రమే మూడో విడత ఎన్నికలకు సమయం ఉందన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం ముమ్మరం చేయాలని ఒమర్ అబ్దుల్లా కోరారు.
ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో కూటమిగా జతకట్టి పోటీ చేస్తున్నారు. మరో ఆరు స్థానాల్లో ఇరువురి మధ్య గట్టి పోటీ నెలకొంది.