కబుర్లు చెప్పేవారికి సమాధానాలా? మహారాష్ట్ర దినోత్సవంలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​

కబుర్లు చెప్పేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉద్దవ్​ ఠాక్రేను ఉద్దేశిస్తు మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ అన్నారు.

May 1, 2024 - 16:19
 0
కబుర్లు చెప్పేవారికి సమాధానాలా?  మహారాష్ట్ర  దినోత్సవంలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​

ముంబై: కబుర్లు చెప్పేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉద్దవ్​ ఠాక్రేను ఉద్దేశిస్తు మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ అన్నారు. బుధవారం మహారాష్ర్ట దినోత్సవం సందర్భంగా మరాఠా సోదరులకు రాష్ర్ట అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. నాగ్‌పూర్‌లోని కస్తూర్‌చంద్ పార్క్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం సభలో ప్రసంగించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన ఓట్ల శాతం తక్కువేమీ కాదని అన్నారు. ఈ శాతం బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి నిదర్శనంగా ఫడ్నవీస్​ పేర్కొన్నారు. అన్నిదశల్లోనూ జరగనున్న ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్​ లో పాల్గొనాలని ఫడ్నవీస్​ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఉద్దవ్​ పేరు ఉద్దేశించకుండానే అతను కబుర్ల మనిషని అన్నాడు. ఆయన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహారాష్ర్ట ఎలా అభివృద్ధి చెందిందో, భవిష్యత్​ లో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్న నమ్మకాన్ని మరాఠా సోదరులకు ఉందని తెలిపారు. 

కాగా మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో పలు హాట్ స్థానాల్లో పోలింగ్ జరగనుండడం గమనార్హం. మూడో దశలో ఓటింగ్ జరగనున్న హై ప్రొఫైల్ స్థానాల్లో, ఎన్‌సిపి కంచుకోట అయిన బారామతితో పాటు, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, రాయ్‌గఢ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా మరియు హత్కనాంగ్లేలలో ఓటింగ్ మే 7న జరగనుంది.