ఎఫ్​ వై–2024లో.. బ్యాంకుల లాభం రూ. 1.4 లక్షల కోట్లు

అవసరమైతే మరిన్ని బ్యాంకుల అనుసంధానం కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​

May 14, 2024 - 15:01
 0
ఎఫ్​ వై–2024లో.. బ్యాంకుల లాభం రూ. 1.4 లక్షల కోట్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్​ వై–2024లో భారీ లాభాలను నమోదు చేసినట్లు ఎక్స్ఛేంజ్​ లు ప్రకటించిన డేటా మంగళవారం విడుదలైంది. ఈ డేటాను పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. భారతీయ బ్యాంకులు భారీ లాభాలను ఆర్జించాయి. పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​ ఒక్కటి మాత్రమే నష్టాల్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 

గణాంకాల ప్రకారం.. 2024 మార్చి 31 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 1 లక్ష కోట్ల అధిక లాభాన్ని ఆర్జించాయి. 35 శాతంగా వృద్ధిని నమోదు చేశాయి.

లాభాల్లో మొట్టమొదటి వరుసలో ఎస్​బీఐ బ్యాంకు నిలిచింది. రూ. 1,41,203 కోట్ల మొత్తాన్ని ఆర్జించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్  రూ. 8,245 కోట్లు, 228 శాతం వృద్ధి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 13,649 కోట్లు 62 శాతం వృద్ధి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లు ఆర్జించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ.6,318 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం వృద్ధితో రూ.4,055 కోట్లు, ఇండియా బ్యాంక్ 53 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

కాగా ఇటీవలే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ మాట్లాడుతూ.. బ్యాంకుల లావాదేవీల కార్యకలాపాల్లో మరింత స్పష్టత కోసం అవసరం అయితే మరిన్ని బ్యాంకుల అనుసంధానానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీంతో బ్యాంకులు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆర్థిక మోసాలను కూడా పూర్తిగా అరికట్టగలుగుతామని స్పష్టం చేశారు.