సూపర్​ కెప్టెన్​  ..చివరి నిమిషంలో గోల్​ కొట్టిన హర్మీన్​ ప్రీత్​ 

1–1 తో అర్జెంటీనాతో​ డ్రా  – హోరా హోరీగా సాగిన మ్యాచ్​ 

Jul 30, 2024 - 11:36
 0
సూపర్​ కెప్టెన్​  ..చివరి నిమిషంలో గోల్​ కొట్టిన హర్మీన్​ ప్రీత్​ 

నా తెలంగాణ, శాతోవు (ఫ్రాన్స్​) : హాకీ కెప్టెన్​ హర్మీన్​ ప్రీత్ సింగ్​ భారత్ ను నిలబెట్టాడు. చివరి నిమిషంలో గోల్ కొట్టి ఓటమి నుంచి తప్పించాడు. చివరి వరకు హోరాహోరీగా సాగిన గేమ్‌ను 1-1 స్కోర్లతో డ్రాగా ముగించింది. పారిస్ ఒలింపిక్స్‌ హకీ గ్రూప్ స్టేజీలో భాగంగా సోమవారం భారత, అర్జెంటీనా జట్లు తలపడ్డాయి.  గెలుపు కోసం భారత్, అర్జెంటీనా జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. రెండో క్వార్టర్​ మొదలైన 22వ నిమిషంలో లూకాస్ మార్టినెజ్ గోల్​ కొట్టి భారత్ ను ఒత్తిడిలోకి  నెట్టాడు. 1–0తో అర్జెంటీనా మ్యాచ్​ ఆసాంతం ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మ్యాచ్​ ముగిసే సమయం గడుస్తున్నా.. భారత్​ గోల్​ కొట్టలేకపోయింది. దాంతో అర్జెంటీనా  గెలుపు ఖాయమైనట్టు కనిపించింది.  

హర్మీన్​ ప్రీత్ మ్యాజిక్​..

కెప్టెన్​ హర్మీన్​ ప్రీత్​ సింగ్​ భారత్​ మ్యాజిక్​ చేశారు. మ్యాచ్​ మొత్తంలో భారత్ ను అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 1–0 ఆధిక్యాన్ని తగ్గించేందుకు భారత్​ జట్టు ఎన్ని సార్లు ప్రయత్నించినా.. గోల్​ చేయలేకపోంది. చూస్తుండగానే.. మూడు క్వార్టర్లు ముగిసినా ఫలితం  కనిపించలేదు. దాంతో అంతా భారత్‌కు ఓటమి ఖాయమ అనుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందన్న సమయంలో భారత కెప్టెన్ హర్మీన్ ప్రీత్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. లాస్ట్ మినిట్‌లో గోల్ సాధించి భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో చేసిన ఈ గోల్‌తో స్కోర్లు 1-1 సమం అయ్యాయి. దాంతో భారత్, అర్జెంటీనా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ను డ్రా గా ముగించుకోవడంతో ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ముందడుగు వేసింది. భారత్​ తన తదుపరి మ్యాచ్ ను ఐర్లాండ్‌తో తలపడనున్నది.