సీఎంకు నైతికతేదీ?
సంబురాలు తగదు బీజేపీ గౌరవ్ భాటియా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అవినీతి, అక్రమార్కుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై రెండు కేసులు ఉన్నాయని ఒక్కకేసులో బెయిల్ రాగానే ఆయన పార్టీ సంబురాలు జరుపుకోవడం తగదని బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా అన్నారు. శుక్రవారం మీడియాతో భాటియా మాట్లాడారు. సీఎం కార్యాలయానికి వెళ్లని నాయకుడు ఎలా ముఖ్యమంత్రి అవుతారని నిలదీశారు. రాజ్యాంగ పదవిపై ఉండి, అవినీతి ఆరోపణలు వస్తే ఆ పదవిని రాజీనామా చేయాల్సిన నైతికతను సీఎం కేజ్రీవాల్ కోల్పోయారని అన్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తికి నైతికత ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన తెలిపారు. నిజాయితీ లేని కేజ్రీవాల్ తో నైతికతను ఏ మాత్రం ఆశించలేమన్నారు. అరెస్టు వారెంట్ వచ్చిన తరువాత కూడా ఆయన రాజీనామా చేయకపోవడం శోచనీయమని భాటియా మండిపడ్డారు. ఆరు నెలలపాటు జైలులో ఉన్నా ఆయన రాజీనామా చేయకపోవడం ఆయన రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనన్నారు. జైలుకు వెళ్లిన సీఎం రాజీనామా సమర్పించకుండా బెయిల్ పై వచ్చిన తొలిసీఎంగా చరిత్రలో రికార్డుల్లోకకెక్కారని విమర్శించారు. వెంటనే సీఎం రాజీనామా చేయాలని మరోమారు డిమాండ్ చేస్తున్నామని భాటియా డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ఈయనే కింగ్ ఫిన్ అని ఆరోపించారు.