గంజాయి రవాణాపై ఉక్కు పాదం
సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
నా తెలంగాణ, సంగారెడ్డి: గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపి సంగారెడ్డి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆపరేషన్‌లో నిషేధిత 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాముల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న కేసులో గురువారం వివరాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసుల తనిఖీల్లో 40 కిలోల ఎండుగంజాయి లభించింది. స్విఫ్ట్ కారులో గంజాయిని మల్లగొండ అనే వ్యక్తి తరలిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు కూడా ఎండు గంజాయి కేసులో ఇదే నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో మరింత మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
అమీన్ పూర్ బీరంగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ముగ్గురు అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులను చేధించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ నాబ్ ఇన్స్ పెక్టర్ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ విజయ్ కృష్ణ, అమీన్ పూర్ ఇన్స్ పెక్టర్ నాగరాజు, నారాయణ్ ఖేడ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మనూర్ ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్, సిబ్బంది కొనసాగుతున్నారు.