ఘనంగా ఆర్ ఎస్ ఎస్ పథ సంచలన్

Great RSS Patha Sensation

Oct 17, 2024 - 18:02
 0
ఘనంగా ఆర్ ఎస్ ఎస్ పథ సంచలన్

నా తెలంగాణ, నిర్మల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ లో ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సంచలన్, విజయ దశమి వేడుకలు నిర్వహించారు. పథ సంచలన్ లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. గణవేష ధరించిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పథ సంచలన్ లో పాల్గొన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన వక్త గా ప్రాంత కార్యవాహ కాచం రమేష్ హాజరయ్యారు.