దళితులకు స్ఫూర్తి ప్రదాత వెంకట స్వామి
Venkata Swamy is an inspiration to Dalits
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: కార్మిక యోధుడు, దళితులకు స్ఫూర్తి ప్రదాత వెంకట స్వామి అని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. శనివారం గడ్డం వెంకటస్వామి 95వ జయంతోత్సవం సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి అంబేద్కర్ జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన మహానీయుడు కాక అన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల సాధన కోసం పోరాడిన యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు నాగయ్య, రామారావు, తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, అశోక్, మొగులయ్య, మాన్నయ్య, ప్రసాద్, యాదగిరి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.