విద్యార్థులను బలిచేయొద్దు
పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సురేష్
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల మధ్యలో విద్యార్థులను బలి చేయవద్దని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యజమాన్యాలు నిర్వహిస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న రూ. 8500 కోట్ల స్కాలర్ షిప్ ను వెంనే విడుదల చేయాలని డమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తెన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ, జిల్లా ఉపాధ్యక్షులు సందీప్, డివిజన్ నాయకులు అనిల్, సిద్దేశ్వర్, సాత్విక, శివ, దినేష్, శ్రీకాంత్, హర్షిత్, అశ్విని, పల్లవి, రోషిని, శ్రీనిధి, మల్లేశ్వరి, డిగ్రీ కళాశాల నాయకులు శర్మ, అనిల్, అశోక్ రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.