తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ స్టార్ షిప్ ఐదో పరీక్ష విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం స్టార్ షిప్ ప్రయోగం జరిగింది. 96కి.మీ. పైకి వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చి లాంచ్ ప్యాడ్ కు కనెక్టయ్యింది. హెవీ బూస్టర్ సురక్షితంగా రాగా, రాకెట్ ను కూడా హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. భూమి వాతావరణంలో ఈ బూస్టర్ తిరిగి వస్తున్నప్పుడు దీని వేగం గంటకు 26వేల కిలోమీటర్లు, ఉష్ణోగ్రత 1,430 సెంటీగ్రేడ్ లుకా ఉండడం విశేషం.
స్టార్‌షిప్ భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది మరియు హిందూ మహాసముద్రంలో నియంత్రిత ల్యాండింగ్ చేసింది. స్టార్‌షిప్ భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, దాని వేగం గంటకు 26,000 కిలోమీటర్లు మరియు ఉష్ణోగ్రత 1,430 ° Cకి చేరుకుంది.
స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్, సూపర్ హెవీ రాకెట్‌లను కలిపి 'స్టార్‌షిప్' అంటారు. స్టార్‌షిప్‌లో 6 రాప్టర్ ఇంజన్‌లు ఉండగా, సూపర్ హెవీలో 33 రాప్టర్ ఇంజన్‌లు ఉన్నాయి.
స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం కావడంతో ఎలన్ మస్క్ (ఎక్స్ అధినేత) సంతోషం వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ ను రూపొందించింది. ప్రయోగం సక్సెస్ కావడంతో మస్క్ సంబురాలు చేసుకున్నారు. స్టార్ షిప్ పొడవు 397 అడుగులు కాగా, 150 మెట్రిక్ టన్నుల బరువును మోయగదు. అంగారకుడిపైకి ఏకంగా వందమందిని తీసుకువెళ్లాలనే లక్ష్యంతో మస్క్ ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఏది ఏమైనా అంతరిక్షంలో మానవ యాత్ర ద్వారా మస్క్ కొత్త వ్యాపారానికి తెర తీశారనే చెప్పాలి.