హారీస్​ తెచ్చిన ఆర్థిక ముప్పును నివారిస్తాం

Let's avoid the financial threat brought by Harris

Nov 2, 2024 - 13:27
 0
హారీస్​ తెచ్చిన ఆర్థిక ముప్పును నివారిస్తాం

ట్రంప్​ ఎకనామిక్​ మిరాకిల్​ విధానాన్ని తీసుకువస్తాం
ఉద్యోగాలను కల్పిస్తాం ఎన్నికల సభలో డోనాల్డ్​ ట్రంప్​

వాషింగ్టన్​ డీసీ: అమెరికా ఆర్థిక విపత్తుకు బైడెన్​, కమలా హారిస్​ ల విధానాలే కారణమని రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ అన్నారు. శుక్రవారం ఆయన మిచిగాన్​ లోని డెట్రాయిట్​ లో జరిగిన ప్రచార సభలో ప్రసంగించారు. తనకు అవకాశం కల్పిస్తే తాను అమెరికా ఆర్థిక స్థితిని చక్కదిద్దుతానని హామీఇచ్చారు. ఇటీవల హారిస్​ 30వేల ఉద్యోగాలను తొలగించారని ఆరోపించారు. ప్రైవేట్​ రంగంలో కూడా 50వేల ఉద్యోగాలు పోయాయన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉత్పత్తి తయారీ, కొనుగోళ్లను ప్రోత్సహిస్తామని ఉద్యోగాలను కల్పిస్తాని అన్నారు. హారీస్​ తెచ్చిన ఆర్థిక ముప్పును నివారిస్తామని తెలిపారు. ‘ట్రంప్​ ఎకనామిక్​ మిరాకిల్​’ నూతన విధానాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. అమెరికన్​ కార్మికులను హారీస్​ ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది.