త్రాగునీరు కలుషితం ఇద్దరు మృతి

50 మందికి అస్వస్థత  అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ 

Oct 13, 2024 - 21:22
 0
త్రాగునీరు కలుషితం ఇద్దరు మృతి

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సంజీవ్ రావుపేట బావిలోని కలుషితమైన నీటిని త్రాగడం వల్ల ఇద్దరు మృతి చెందగా,50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం వీరిని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్, సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. కలుషిత నీటిని సేవించి అస్వస్థతకు గురైన బాధితులను సిపిఎం నాయకులు మాణిక్యం, జయరాజ్ పరామర్శించి మృత్యువాత పడిన సాయమ్మ, మహేశ్ ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని  డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.