సాంకేతిక వృద్ధిలో నెంబర్​ 1

ఐఎంసీ–2024 ప్రారంభంలో ప్రధాని మోదీ

Oct 15, 2024 - 12:48
Oct 15, 2024 - 13:01
 0
సాంకేతిక వృద్ధిలో నెంబర్​ 1
120కోట్ల మంది మొబైల్ వినియోగదారులు
డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలో 40 శాతం భారత్ దే
నాణ్యత, భద్రతలకు ప్రాముఖ్యత
డబ్ల్యూటీఎస్, ఐఐసి సంయుక్తంగా పనిచేయాలి
సాంకేతికంగా మరింత ముందుకు భారత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సాంకేతికంగా భారత్ అత్యంత వృద్ధిని సాధిస్తోందని దేశంలో తొలివరుసలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 120 కోట్ల మంది 1200 మిలియన్ మొబైల్ వినియోగదారులు దేశంలో ఉన్నారని చెప్పారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే డిజిటల్ లావాదేవీల నిర్వహణలో భారత్ వాటా 40 పైగా ఉంది. డిజిటల్ లావాదేవీలు, సాంకేతికతను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. అదే సమయంలో నాణ్యత, భద్రతలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
 
మంగళవారం న్యూఢిల్లీ భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ -వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ ఇ) 8వ ఎడిషన్, ది ఫ్యూచర్ ఈజ్ నౌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఐసిఇ) 8వ ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ కలిగి ఉన్నారు. ఆసియా పసిఫిక్‌లో భారత్‌లో ఐటీయూ–డబ్ల్యూటీఎస్ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సీవోఐఐ భాగస్వామ్యంతో ఈ మెగా టెక్ ఈవెంట్ జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్ టెల్, జియో, బీఎస్ ఎన్ ఎల్,వీఐ వంటి టెక్ దిగ్గజ సంస్థల ప్రముఖులు, కేంద్ర ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలు. 
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ..డబ్ల్యూటీఎస్, ఐసీఐలు సంయుక్తంగా పని చేయడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ప్రపంచ నాణ్యత ప్రమాణాలు, భద్రతతో కూడుకున్న సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సేవల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రపంచంలో భారతదేశాన్ని మరింత శక్తివంతం చేసే దిశగా పనిచేయాలన్నారు. 
 
21వ శతాబ్ధం మొబైల్, టెలికాం రంగం ప్రపంచంతో పోటీ, అధ్యయనం చేసే అంశంగా ఉంది. భారత్ మొబైల్, టెలికామ్ లను కనెక్టివిటీ మాధ్యమంగానే కాకుండా ఈక్విటీ మాధ్యమంగా కూడా రూపొందించడం సంతోషకరమని తెలిపారు. భారత్‌లో గ్రామం, నగరం, ధనిక, పేదల మధ్య అంతరాన్ని, దూరాన్ని తగ్గించడానికి ఈ రంగం విశేష కృషిని ప్రధానమంత్ర నరేంద్ర మోదీ కొనియాడారు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
ఐసీ–2024 భారత్‌లో టెలికాం రంగం వృద్ధిపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరించారు. ఈ దేశ ప్రజలు అనేక సేవలనూ పొందారని చెప్పారు. బ్యాంకింగ్ సేవలు ప్రతీఒక్కరికి చేరువయ్యాయని తెలిపారు. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ భారత్‌లో ప్రస్తుతం 90 కోట్ల నుంచి 116 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ (ఓఎఫ్‌సీ) పరిధి 11 మిలియన్ల నుండి 41 మిలియన్లకు పెరిగింది. దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరించాయని తెలిపారు. 90 శాతం గ్రామాల్లో సేవలు చేరాయని తెలిపారు. యూపీఐ ద్వారా చెల్లింపుల సంఖ్యలో కూడా వృద్ధి నమోదు కావడం సంతోషకరమని సింధియా తెలిపారు. 
 
జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ..
భారత్ ఈఐ సాంకేతికతను స్వీకరించే సమయం ఆసన్నమైందని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 
 
ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి..
ఈఐఐ ద్వారా నకిలీ కాల్‌లను రద్దు చేసే సంస్థ సాంకేతికతను తొలిసారిగా దేశంలో తమ ఎయిర్ టెల్ చేపట్టిందని చైర్మన్ సునీల్ భారతి చెప్పారు. లక్షలాది ఫేక్ కాల్స్, మేసేజ్ లను బ్లాక్ చేశామని చెప్పారు. సరఫరాకు కేంద్ర ప్రభుత్వం చేసిన నాణ్యమైన సేవను అందించడంలో తమ సంస్థ ముందువరుసలో ఉందని స్పష్టం చేశారు. 
 
వీఐ చైర్మన్ కుమార మంగళం బిర్లా..
నకిలీ కాల్స్, మేసెజ్ లు, ఫిషింగ్ లను ఆపడానికి వోడాఫోన్ ఐడియా రూపొందించిన ప్రణాళికను వీఐ చైర్మన్ కుమార మంగళం బిర్లా వివరించారు. తమ ప్రభుత్వం, సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.