రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
డిసెంబర్ 20న ఆరు స్థానాల్లో ఎన్నికలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. మంగళవారం షెడ్యూల్ విడుదల సందర్భంగా డిసెంబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏపీలోని మూడు, పశ్చిమ బెంగాల్,హరియాణా, ఒడిశాలో ఒక్కో స్థానానికి ఎన్నికలను నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. డిసెంబర్ 3న నోటిఫికేషన్, నామినేషన్ కు చివరి తేదీ డిసెంర్ 10, 11 నామినేషన్ల పరిశీలన 13న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 20న ఎన్నికల నిర్వహణతోపాటు అదే రోజు ఫలితాలను ప్రకటించనునట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని మోపీదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, ఒడిశా సుజిత్ కుమార్, పశ్చిమ బెంగాల్ జ్వార్ సిర్కార్, హరియాణా కృషన్ లాల్ పన్వర్ హరియాణాలు రాజీనామాలు సమర్పించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.