మెదక్ లో గణనాథునికి ప్రత్యేక పూజలు
హోమాలు, అన్నదానం భారీ ఎత్తున భక్తుల సందర్శనలు
తెలంగాణ, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా గణనాథుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం జమ్మికుంటలో సూర్యగణేష్ మండలి వద్ద రాజు సంగమేశ్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హోమాలు, పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన నిర్వహించారు. ఈ కార్యక్రమలకు భారీ ఎత్తున భక్తులు విచ్చేసి గణనాథున్ని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
రాందాస్ చౌరస్తా, ఆటోనగర్, ఆజంపుర, న్యూమార్కెట్ చమన్, వీర హనుమాన్ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథులు ప్రత్యేకతను సంతరించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతాల గణనాథులను దర్శించుకుంటున్నారు. ఆయా ప్రాంతాలను గణనాథులకు ప్రత్యేక పూజలు, లలిత సహస్రనామాలు ఘనంగా నిర్వహించారు.