డబుల్ బెడ్రూమ్ లా.. చెరువులా?
A double bedroom or a pond?
ఏకరువు పెట్టుడుతున్న పట్టించుకోని అధికారులు
నా తెలంగాణ, మెదక్: మెదక్ పట్టణంలోని పిల్లి కోటాల్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల బయట పూర్తి నీటితో నిండిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను కాలనీవాసులు పలుమార్లు ఏకరువు పెట్టుకున్నా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లే మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజువారీ అవసరాలకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులే గాక రోజువారి పనులపై బయటికి వెళ్లే వారు కూడా ఈ చెరువును తలపించే నీటిని దాటుతూనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనాలకు రిపేర్లు సహజంగా మారాయనే ఆవేదన వ్యక్తం అవుతోంది. మరోవైపు రోజూ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నీటిలోనుంచే వెళుతూ పూర్తిగా తడిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.