కరవు భత్యం విడుదల చేయాలి

టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్

Oct 18, 2024 - 18:50
 0
కరవు భత్యం విడుదల చేయాలి

 నా తెలంగాణ, మెదక్: ఉద్యోగులకు న్యాయంగా రావలసిన ఐదు విడతల కరవు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ డిమాండ్​ చేశారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్​ లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ఉద్యోగుల అన్ని రకాల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

కరవు భత్యం, కాంట్రిబ్యూటీ, పెన్షన్​ నగదు రహిత ఆరోగ్య కార్డుల అందజేత, అదనపు ఇంటి అద్దె అలవెన్స్​, వ్యవసాయ విస్తరణ అధికారులకు సహయకుల నియామకం, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్​ బిల్లలు, టీఎస్ జిఎల్ ఐ కార్యాలయ మార్పు తదితర తీర్మానాలు జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్ ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఈ నెల 22న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్​ వద్ద భోజన విరామ సమయంలో ధర్నా చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షులు ఎండి ఇక్బాల్ పాష, కోశాధికారి ఎం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కే ఫణి రాజ్, ఎండి ఫజలుద్దిన్, కోటి రఘునాథరావు,  లీల, సంయుక్త కార్యదర్శులు పోతురాజు శంకర్, పంపరి శివాజీ, కిరణ్ కుమార్, రాధా, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నర్సింలు, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యురాలు దోమ, రామాయంపేట, చేగుంట, అల్లాదుర్గ్, నర్సాపూర్,  ఏడుపాయల వనదుర్గ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు అనుముల ప్రభాకర్, అశోక్ రెడ్డి, ధర్మాచందర్, రాకేష్, ప్రశాంత్, విజయ్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు జంగం నగేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ ఫోరం జిల్లా కార్యదర్శి లింగమూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి శేఖర్, నీటిపారుదల శాఖ ఫోరం జిల్లా కార్యదర్శి శ్రీ హర్ష, వైద్య ఆరోగ్యశాఖ ఫోరం జిల్లా కార్యదర్శి మంజుల, సలావుద్దీన్, చంద్రశేఖర్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.