పాక్స్​ అధ్యక్షుడిపై దాడి

నిందితులపై చర్యలకు బీఆర్​ఎస్​ డిమాండ్​

Sep 27, 2024 - 20:30
 0
పాక్స్​ అధ్యక్షుడిపై దాడి

 నా తెలంగాణ, టేక్మాల్: పాక్స్​ అధ్యక్షుడిపై దాడిని బీఆర్​ఎస్​ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం బీఆర్​ ఎస్​ ఆధ్వర్యంలో  టేక్మాల్ నుంచి పోలీస్​ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్​ఎస్​ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ..పాక్స్​ అధ్యక్షుడు యశ్వంత్​ రెడ్డిపై సత్యం, భూమయ్య దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వీరిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అల్లదుర్గం సీఐ రేణుక రెడ్డికి వెంటనే చర్యలు చేపట్టాలని మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కానీయకూడదని కోరారు. సీఐ హామీ మేరకు ఆందోళన విరమించారు.