బిహార్​, ఆంధ్రప్రదేశ్​ లకు ప్రత్యేక నిధులు

Special funds for Bihar and Andhra Pradesh

Jul 23, 2024 - 14:42
 0
బిహార్​, ఆంధ్రప్రదేశ్​ లకు ప్రత్యేక నిధులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 బడ్జెట్​ లో బిహార్​, ఆంధ్రప్రదేశ్​ లకు కేంద్రలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. 

బిహార్​ కు రూ. 58,900 కోట్లు..


బిహార్​ లోని రోడ్డు ప్రాజెక్టులకు రూ. 26,000 కోట్లు కేటాయింపు.

పాట్నా–పూర్నియా, బక్సర్​–భాగల్​ పూర్​ లను కలుపుతూ ఎక్స్​ ప్రెస్​ వే, బుద్ధగయ, రాజ్​ గిర్​, వైశాలి దర్భాంగలను కలుపుతూ ఎక్స్​ ప్రెస్​ వేల నిర్మాణాలు.

పిర్‌పైంటిలో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు. 

వరద సహాయం కింద రూ.11,500 కోట్.

మహాబోధి దేవాలయం, విష్ణుపాద్ ఆలయాల అభివద్ధి. 

కొత్త వైద్య కళాశాలలు, విమానాశ్రయాల నిర్మాణాలు. 

క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు.

గంగా నదిపై రెండు కొత్త వంతెనల నిర్మాణం. 

అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌, గయాలో పారిశ్రామిక అభివృద్ధి.


ఆంధ్రప్రదేశ్​ కు రూ. 15,000 కోట్లు..


పోలవరం నిర్మణానికి ఆర్థిక సాయం.

వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ.

రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ.

పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం.

హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం.

కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు.