కలలను సుసంపన్నం చేసే బడ్జెట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బడ్జెట్ భారతదేశ కలలను సుసంపన్నం చేసేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ 2024–25 బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ ఆయన స్పందన తెలిపారు.
నిరుపేదలు, యువత, నిరుద్యోగులు, మధ్యతరగతికి ఊతం ఇచ్చే బడ్జెట్ అన్నారు. గిరిజనులు, దళితులు, వెనుకబడిన ప్రజల సాధికారత కోసం ఈ బడ్జెట్ లో పటిష్ఠమై ప్రణాళికను రూపొందించిదన్నారు.
గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. వారి ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్ఠం చేయడంతోపాటు మరింత మంది నిరుపేదల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తుందన్నారు. ఈ బడ్జెట్ తో లెక్కలేనన్ని నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. బడ్జెట్ లో మహిళల ఆర్థిక స్వావలంభన దిశగా అన్ని చర్యలు తీసుకోవడం సంతోషకమన్నారు.
వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు ఊతం లభిస్తుందన్నారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం సంతోషకరమని ప్రధాని మోదీ అన్నారు. దీంతో స్థిరమైన అభివృద్ధికి బాటలు వేశామన్నారు. విద్య, స్కిల్ డెవలప్ మెంట్ కు అధిక ప్రాధాన్యత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
భారతదేశ ప్రగతి కోసం ప్రతీ గ్రామం, నగరంలోనూ ఇంటి పరిశ్రమలకు అత్యధిక ప్రోత్సాహం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందుకే గ్యారెంటీ లేని ముద్రా రుణపరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచామన్నారు. దీంతో ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహం అందజేస్తాని ప్రధాని నరేంద్ర మోద స్పష్టం చేశారు.
భారత్ ను ప్రపంచంలో గ్లోబల్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ హబ్ గా ఈ బడ్జెట్ తీర్దిదిద్దనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ద్వారా నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.