ఒలింపిక్స్​ లో భారత్​ కు మూడో పతకం

రైఫిల్​ లో స్వప్నిల్​ కు కాంస్యం అభినందించిన కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Aug 1, 2024 - 15:32
Aug 1, 2024 - 15:33
 0
ఒలింపిక్స్​ లో భారత్​ కు మూడో పతకం
పారిస్​: పారిస్​ ఒలింపిక్స్​ లో భారత్​ కు మూడో కాంస్య పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్​ త్రీ పొజిషన్​ గురువారం జరిగిన పోటీలో షూటర్​ స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లో సాధించి కాంస్యాన్ని అందించాడు. 
దీంతో ఒలింపిక్స్​ లో భారత్​ సాధించిన పథకాల సంఖ్య మూడుకు చేరింది. 
గతంలో కువైట్​ లో జరిగిన ఆసియా షూటింగ్​ లో స్వప్నిల్​ బంగారు పతకం సాధించాడు. గగన్​ నారంగ్​, చెన్​ సింగ్​ ల వంటి పెద్ద షూటర్​ లను కూడా ఓడించాడు. 
స్వప్నిల్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. 28 ఏళ్ల స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ షూటింగ్ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. 2024లో ఒలింపిక్ లో అరంగేట్రం చేసిన స్వప్నిల్​ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
 
కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అభినందనలు..
పారిస్​ ఒలింపిక్స్​ లో కాంస్య పతకం సాధించిన షూటర్​ స్వప్నిల్​ కుసాలేకు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్​ కు మూడో పతకం సాధించి పెట్టిన స్వప్నిల్​, భారత క్రీడాకారులు పోటీల్లో రాణించాలని కిషన్​ రెడ్డి ఆకాంక్షించారు.