ధరణీ సమస్యల పరిష్కారానికిస్పెషల్​ డ్రైవ్

​ మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​

Sep 20, 2024 - 16:18
 0
ధరణీ సమస్యల పరిష్కారానికిస్పెషల్​ డ్రైవ్

నా తెలంగాణ, మెదక్​: ధరణీ పెండింగ్​ లో ఉన్న ఆర్జీలను స్పెషల్​ డ్రైవ్​ ద్వారా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ నిమగ్నమైందని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. శుక్రవారం కలెక్టర్​ రాహుల్​ రాజ్​ మీడియాఓ మాట్లాడారు. జూలై 1వ తేదీ నాటికి 10,400 దరఖాస్తులు పెండింగ్​ లో ఉన్నాయని, ఆగస్ట్​, సెప్టెంబర్​ లలో వచ్చిన దరఖాస్తులను కూడా కలుపుకుంటే 14వేలు ఉన్నాయన్నారు. గడిచిన రెండు నెలలకాలంలో 10వేల దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుల పరిష్కారం కోం ప్రజావాణి ద్వారా కూడాప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ప్రజావాణిలో సంబంధిత తహశీల్దార్​, రెవెన్యూ   కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. దరఖాస్తులపై ఏడు పనిరోజులలో రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాహుల్ రాజ్​ స్పష్టం చేశారు.