గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యునిగా కంది శ్రీనివాస్ రెడ్డి

Kandi Srinivas Reddy as a member of the Rural Journalists Welfare Committee

Sep 28, 2024 - 18:50
 0
గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యునిగా కంది శ్రీనివాస్ రెడ్డి

నా తెలంగాణ, మెదక్: టీయూడబ్ల్యూజే (ఐజేయూ)  రాష్ట్ర గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యునిగా మెదక్ జిల్లా సీనియర్ జర్నలిస్టు కంది శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు  టీయూడబ్ల్యుజే ( ఐ జే యూ) యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ ఆలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో వివిధ దినపత్రికలలో పనిచేశారు.  ప్రస్తుతం జిల్లా పయొనీర్​ దినపత్రిక జిల్లా ప్రతినిధిగా, సిద్దిపేట టైమ్స్ డిజిటల్ దిన పత్రిక డైరెక్టర్ గా, కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా అక్రిడిటీషన్ కమిటీ సభ్యునిగా, జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, ఉమ్మడి జిల్లాకో కన్వీనర్ గా, మెదక్ పొలిటికల్ జేఏసీ కో కన్వీనర్ గా పనిచేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షులు విరాహాత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాం నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యునిగా నియమించినందుకు తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. గ్రామీణ విలేకరుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.