విశ్రాంత పోలీసు అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి 

సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య 

Sep 20, 2024 - 16:05
 0
విశ్రాంత పోలీసు అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి 
 నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: విశ్రాంత పోలీసు అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని యశ్వంత పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా టి.వేణు గోపాలస్వామి శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ని కలిసి పుష్పగుచ్చం అందించారు. వేణుగోపాల స్వామిని ఎస్పీ అభినందించారు. 
 
 ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ.. జిల్లా, రాష్ర్ట స్థాయిలో విశ్రాంత పోలీసు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు విశ్రాంత ఉద్యోగులు పోలీసు సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ అఫ్జల్, జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి, జీవన్, జహింగీర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.