విధుల్లో నిర్లక్ష్యం రేగోడు తహశీల్దార్ సస్పెన్షన్
కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ
నా తెలంగాణ, మెదక్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన రేగోడు తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్ తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేశారు. రేగోడు తహశీల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీకి రాగా తహశీల్దార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీగాక ఈ తహశీల్దార్ పై ప్రజలు, రైతుల నుంచి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తహశీల్దార్ కలెక్టర్ కు రైతులు, లబ్ధిదారులతో సమావేశ, సమస్యల పరిష్కార వివరాలు సమర్పించారు. కలెక్టర్ ఆకస్మిక తనికీ తహశీల్దార్ సస్పెన్షన్ తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే రేగోడుకు నూతన తహశీల్దార్ గా నరేష్ ను నియమించింది. ఇటు ఆదేశాలు అందుకున్న నూతన తహశీల్దార్ నరేష్ వెంటనే విధుల్లోకి చేరారు. కాగా తహశీల్దార్ సస్పెన్షన్ పట్ల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.