గణనాథునికి ప్రత్యేక పూజలు
Special Pujas to Lord Ganesh
నా తెలంగాణ, మెదక్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మెదక్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని ఆజాంపూర వక్రతుండ గణేష్ మండలి, జమ్మికుంటలోని సూర్యగణేష్ మండలి రాజు సంగేమేష్ ఆధ్వర్యంలో, రాందాస్ చౌరస్తాలోని ఆటోనగర్ న్యూ మార్కెట్ చమన్ వీర హనుమాన్ కాలనీలలో ఘనంగా గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు, యువకులు లంబోదరుడి పూజల్లో పాల్గొని తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. గణనాథ మండప నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.