పోషకాలతో గర్భిణీలు, పిల్లలకు మేలు
జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఏర్పాటు
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: గర్భిణీలకు పోషకాహారంప ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఆదివారం ఈ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని సంగారెడ్డి ఫసల్వాది గ్రామంలో నిర్వహించారు. ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా పోషకాల ప్రాధాన్యతను విరించారు. రాగిలడ్డూల తయారీ, చిరుధాన్యాల వల్ల ఉపయోగాలు అందే పోషక విలువలు పిల్లలు, తల్లులకు లభించే పోషకాల గురించి వివరించారు. యువకులు, గ్రామస్తులు మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, ఎన్ ఎస్ ఎస్, అంగన్ వాడీ, టీచర్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్. అమీర్ భాష, డాక్టర్ శ్రీలత, డాక్టర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.