కనుల పండువగా భళా కళా ఉత్సవ్

Bhala Kala Utsav as the festival of the eyes

Oct 16, 2024 - 20:36
 0
కనుల పండువగా భళా కళా ఉత్సవ్

నా తెలంగాణ, మెదక్: మెదక్ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలను డీఈవో రాధాకిషన్ మెదక్ పట్టణంలోని వెలుగు పాఠశాలలో బుధవారం ప్రారంభించారు. పోటీలలో భాగంగా సంప్రదాయ, జానపద  నృత్యం, చిత్ర లేఖనం, వాయిద్యాల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా  విద్యాశాఖాధికారి  మాట్లాడుతూ చదువుతో పాటు వివిధ రకాల కళలో ఆసక్తిని కలిగి ఉండాలని, కళలు సృజనాత్మకను పెంచుతాయని, మనలోని కళను చాటేందుకు కళా ఉత్సవ్ మంచి వేదికని అన్నారు. విద్యార్థులు  జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయిలో , జాతీయ స్థాయిలో  రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, న్యాయ నిర్ణేతల కమిటీ కన్వీనర్ రామేశ్వర ప్రసాద్, ఉపాధ్యాయులు నర్సింగరావు, అంజాగౌడ్, మాధవ రెడ్డి, ప్రవీణ్, వంశీ, శశిధర్ గౌడ్, గోపాల్,  లక్ష్మీ ప్రసన్న, శ్రీకాంత్ పాల్గొన్నారు.