రాంచీ: ఎట్టకేలకు జేఎంఎం వ్యవస్థాపకుల్లో ఒకరు, ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (67) బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపై బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
జేఎంఎం అభివృద్ధికి ఎంతగా పాటుపడ్డా తనకు విలువనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ చొరబాట్ల వల్ల ఆదివాసీల ఉనికి ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలో రాష్ర్ట అభివృద్ధికి పాటుపడతానని సోరెన్ తెలిపారు.
కొల్హన్ టైగర్..
కొల్హన్ టైగర్ గా పిలువబడే చంపై సోరెన్ జేఎంఎం శిబూ సోరెన్ కు అత్యంత దగ్గరి వారిలో ఒకరు. హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చాక సీఎం పదవికి రాజీనామాతో కొల్హన్ నొచ్చుకున్నారు. గిరిజన, ఆదివాసీ, నిరుపేద వర్గాలలో చంపైకు మంచి పేరుంది. ఝార్ఖండ్ రాజకీయాల్లో ఈయన పాత్ర అతిముఖ్యమైనదిగా బీజేపీ గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే టైగర్ ను పార్టీలో చేర్చుకుంది.