సభ్యత్వ నమోదుకు సమాయత్తం
బీజేపీ రాష్ట్ర నాయకులు రాం నాథ్
నా తెలంగాణ, నిర్మల్: రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి బూత్ స్థాయిలో కనీసం 200 మందికి తగ్గకుండా నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాం నాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ లక్ష్మణ చాంద మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు పొలాస గోవర్ధన్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ హాజరై ప్రసంగిస్తూ సభ్యత్వ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి పోలింగ్ బూత్ లో 200 మందికి తగ్గకుండా సభ్యులను చేర్చాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను స్వచ్ఛందంగా బీజేపీలో చేర్పించాలని, సభ్యత్వం తోనే పార్టీ మనుగడ సాధిస్తుందని అన్నారు. మహిళలు సైతం ముందుకు రావటం అభినందనీయమన్నారు. స్థానిక ఎన్నికలలో 90 శాతం బీజేపీ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలన్నారు. ఇప్పటినుంచే పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసి ప్రతిపక్షాలకు ధీటుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలాప ప్రయత్నాలు మొదలుపెట్టాలన్నారు.