నా తెలంగాణ, మెదక్: బీజేపీ సభ్యత్వ వర్క్ షాప్ సమావేశం పట్టణంలోని బీజేపీ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి నందారెడ్డి ప్రసంగించారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు నమోదు చేపడతామన్నారు. ఈ తరువాత విజయవంతం చేయాలన్నారు. అత్యధిక సభ్యత్వాలతో గిన్నిస్ బుక్ రికార్డులోకి పార్టీ చేరింది. అలాంటి పార్టీలో చేరడం ప్రతీ ఒక్కరికి గర్వకారణమన్నారు. మెదక్‌లోని ప్రతీ గ్రామంలోని ప్రతీ గ్రామంలో 200 వరకు నమోదు చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ శ్రేణులకు సూచించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ, మల్లి లోకేష్, ఆకుల రాము, శివ, విఠలేశ్, సన్నీ, ఆంజనేయులు, సుధాకర్, సంతోష్, సాయి, బంటి, రాహుల్, సంగీత, బూత్ స్థాయి అధ్యక్షులు , కార్యకర్తలు ఉన్నారు.