రాహుల్​, ప్రియాంకలు అయోధ్యకు

గుణపాఠం చెప్పే సమయం ఆసన్నం యూపీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి

Apr 26, 2024 - 18:02
 0
రాహుల్​, ప్రియాంకలు అయోధ్యకు

లక్నో: రామనామాన్ని వ్యతిరేకించే, అయోధ్యలో రామ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించిన రాహుల్​ గాంధీకి అయోధ్య ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. శుక్రవారం ఆయన మొరాదాబాద్​ ఎన్నికల సభలో ప్రసంగించారు. ఎట్టకేలకు ఆ రాముడే వారిని అయోధ్యకు రప్పిస్తున్నారని అన్నారు. బాలరాముడి ప్రతిష్టను తిరస్కరిస్తూ అసలు రాముడనే భగవంతుడే లేడన్న వారికి అయోధ్య రామ మందిర దర్శనాన్ని చేసుకునే ఆలోచన ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు అయోధ్యకు రానున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. మరోమారు దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొంది ఎన్నికలయ్యాక హిందూ దేవుళ్లను విమర్శించడం వీరికి పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. వీరి చర్యలు నమ్మదగినవి కాదని అన్నారు. ఇలాంటి మోసగాళ్లు, అవినీతి పరులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్​, కూటమి పార్టీ నాయకులు దేశ విచ్ఛిన్నానికి, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వారన్నారు. ఈ విషయం పలుమార్లు నిరూపితమైందన్నారు. ఈ అహాంకారులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు