ఎన్డీయే కూటమిలోకి ఆర్ఎల్డీ
ఆర్ఎల్డీ (రాష్ర్టీయ లోక్ దళ్) పార్టీ ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) కూటమిలో చేరింది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్ఎల్డీ (రాష్ర్టీయ లోక్ దళ్) పార్టీ ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) కూటమిలో చేరింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోషల్ మీడియా వేదికగా ఆదివారం తెలిపారు. ఆర్ఎల్డీ వ్యవస్థాపకుడు జయంత్ సింగ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషికి తమ పార్టీ సహకారం అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరామని జయంత్ తెలిపారు. జయంత్ సింగ్ జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. ఈయన చేరికను స్వాగతించిన నడ్డా, షాలు మాట్లాడుతూ.. దేశ, యూపీ అభివృద్ధి కోసం ఆర్ఎల్డీ జయంత్ సింగ్ ఎన్డీయే కూటమిలో చేరడం సంతోషకరమన్నారు. రానున్న సమయంలో తమతో కలిసి దేశాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఎన్నికల్లో మనమంతా కలిసి 400 సీట్ల మార్కును దాటేందుకు ఐక్యతతో పాటుపడతామని నడ్డా, షాలు పునరుద్ఘాటించారు.