మంచువారమ్మాయి మొదలెట్టేసింది

టాలీవుడ్ లో హోస్ట్ గా, న‌టిగా, నిర్మాత‌గా ఆల్ రౌండర్ ప్రతిభ‌తో మెప్పించిన లక్ష్మీ మంచు కెరీర్ లో ఎన్నో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు.

Apr 17, 2024 - 16:12
 0
మంచువారమ్మాయి మొదలెట్టేసింది

టాలీవుడ్ లో హోస్ట్ గా, న‌టిగా, నిర్మాత‌గా ఆల్ రౌండర్ ప్రతిభ‌తో మెప్పించిన లక్ష్మీ మంచు కెరీర్ లో ఎన్నో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. మంచు కుటుంబంలో మేలిమి ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. కొంత కాలంగా తాను ముంబైలో నివాసం ఉంటున్నాన‌ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ కొలువుదీరిన చోట‌ సొంతంగా ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంటికి అవ‌స‌ర‌మైన ఇంటీరియ‌ర్ డిజైన్ కి సంబంధించిన వీడియోను ఇంత‌కుముందు ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఈ ఇంటిని డిజైన్ చేయించడం ఆసక్తిని క‌లిగించింది.- క్రేజీ మల్టీస్టారర్.. బిగ్గెస్ట్ డిజాస్టర్ ముంబై ఫిలింస‌ర్కిల్స్ లో మంచు ల‌క్ష్మీకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరంద‌రికీ టాలీవుడ్ తో గొప్ప అనుబంధం కూడా ఉంది.

వీరిలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌గ్య జైశ్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్నారు. భూమి ఫెడ్నేక‌ర్ లాంటి ప్ర‌తిభావంతురాలైన స్నేహితురాలు ల‌క్ష్మీ మంచుకి ఉన్నారు. త‌న సెల‌బ్రిటీ ఫ్రెండ్ స‌ర్కిల్స్ తో క‌లిసి లక్ష్మీ మంచు దిగిన ఫోటోలు కూడా ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. న‌టిగా హిందీ సినిమాలు సిరీస్ ల‌తోను ల‌క్ష్మీ మంచు బిజీ కానున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.  విశాల్‌ మ‌రోవైపు త‌న సోద‌రుడు మంచు మ‌నోజ్- మౌనిక దంప‌తులు మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చార‌ని ఎంతో ఆనందంగా వెల్ల‌డించిన లక్ష్మీ ప్ర‌స‌న్న వారికి త‌న బ్లెస్సింగ్స్‌ని అందించారు.

తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోషూట్‌లో ల‌క్ష్మీ మంచు పూర్తిగా బ్లూ అండ్ బ్లూ లుక్ లో క‌నిపించారు. షైనింగ్ బ్లూ ఫ్రాక్‌లో ప్ర‌సన్న ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నార‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. `బ్లూస్‌ని తీసివేయడానికి ఉత్తమ మార్గం? నీలిరంగు ధరించండి..` అంటూ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని జోడించారు.

అమెరికన్ టెలివిజన్ ధారావాహిక `లాస్ వేగాస్`తో న‌ట‌నారంగేట్రం చేసిన లక్ష్మి మంచు డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ  లలో ఎపిసోడ్స్‌లో న‌టించారు. 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లో తన నట ప్రయాణాన్ని ప్రారంభించిన లక్ష్మి ప‌లు చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరిగే ఆదిపర్వం అనే చిత్రంలో న‌టిస్తున్నారు. దెయ్యాల బారి నుండి ఒక అమ్మాయిని విడిపించే యువ‌తి పాత్ర‌లో ల‌క్ష్మీ మంచు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం బ‌హుభాష‌ల్లో విడుద‌ల కానుంది.