ప్లాట్ మారితే... ఫేట్ మారుతుందేమో!
టాలీవుడ్ బడా హీరోలతో ఒకప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించింది పూజా హెగ్డే. సడెన్ గా టాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి.
టాలీవుడ్ బడా హీరోలతో ఒకప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించింది పూజా హెగ్డే. సడెన్ గా టాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి.
బాలీవుడ్ ను నమ్ముకున్న పూజా తాజాగా ముంబాయిలో స్థిరపడాలని చూస్తోంది. కాగా
పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారబోతున్నారని తెలిసింది. సముద్రానికి ఎదురుగా ఉన్న 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్ లోకి దిగుతోంది. దీని ఖరీదు రూ.45 కోట్లు. ఈ కొత్త ఆస్తి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. బాంద్రా అనగానే బాలీవుడ్ అగ్ర తారలంతా కొలువుండే చోటు అని వెంటనే గుర్తిస్తారు. అలాంటి చోట తన స్టాటస్ ని చూపించేందుకు పూజా ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఇంటికి ఇంటీరియర్ సహా డిజైనింగ్ పరంగా వరల్డ్ క్లాస్ లో వర్కవుట్ చేస్తోందని సమాచారం. ఒక సోర్స్ ప్రకారం..పూజా హెగ్డే 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన సీఫేసింగ్ అపార్ట్ మెంట్ లోకి మారుతున్నారు.
అద్భుతమైన విజువల్ బ్యూటీ ఉన్న ఇల్లు ఇది. అన్ని విధాలా సౌకర్యవంతమైన ప్రదేశంలో ఇది ఉంది. అంతకుముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. గోవా నుంచి వరుస ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేయగా ఇవి.. 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను అలరించాయి. పూజా పూల్ సైడ్ ట్రీట్ అభిమానుల హృదయాలను తాకింది. పూజా కెరీర్ మ్యాటర్ కి వస్తే... షాహిద్ తో దేవా కాకుండా సాంకి అనే చిత్రంతోను బిజీగా ఉంది. మూడు ప్రధాన దక్షిణ భారత సినిమాల్లో నటిస్తోంది. కనీసం ఇల్లు మారితే కెరీర్ పూజా బాగుంటుందేమో చూడాలి.