మళ్లీ సీఎం జగనే
'ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూచోబెట్టారంటే మామూలు విషయం కాదు. నేను ఎవరి మీదనో కోపంతోనో నమ్మకం లేకనో చెప్పడం లేదు.
'ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూచోబెట్టారంటే మామూలు విషయం కాదు. నేను ఎవరి మీదనో కోపంతోనో నమ్మకం లేకనో చెప్పడం లేదు. మీరు అడిగారని చెబుతున్నాను.. తప్పకుండా జగన్ గారే నెక్ట్స్ సీఎం అవుతారు'' అని వ్యాఖ్యానించారు స్టార్ హీరో విశాల్. ప్రముఖ తెలుగు వార్తా చానెల్ ఇంటర్వ్యూలో విశాల్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఇంతకుముందు టీడీపీ నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో దానిని ఖండించిన విశాల్, ఇప్పుడు జగన్ నెక్ట్స్ సీఎం అవుతాడు! అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. విశాల్ ఇంకా ఏమన్నారంటే..? వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాని ఎప్పుడూ చెప్పలేదు. జగన్ గారిని బయట నుంచి ఫాలో చేసే వ్యక్తిని. ఆయన చేసే పనులను ఫాలో చేస్తున్నా. ఆయన నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ఇప్పటివరకూ ఏం చేస్తున్నారు? ఎలా అన్నిటి నుంచీ బయటకు వచ్చారు? అనేది చూసాను... అని విశాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు? అని ప్రశ్నించగా.. ''ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూచోబెట్టారంటే మామూలు విషయం కాదు. నేను ఎవరి మీదనో కోపంతోనో నమ్మకం లేకనో చెప్పడం లేదు. తప్పకుండా జగన్ గారే నెక్ట్స్ సీఎం అవుతారు'' అని వ్యాఖ్యానించారు.
జగన్ పై ఎటాక్ ని రాజకీయ కోణంలో చూస్తారా? అని ప్రశ్నించగా.. ఇలాంటి ఎటాక్ లు జగన్ గారికి కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఎయిర్ పోర్ట్ లోను దాడి జరిగింది. ఆ కత్తి వచ్చి పొడుచుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. కానీ జగన్ అన్ని విషయాల్లో ధైర్యవంతుడు అని అన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన వారికి ధైర్యం, తెగువ ఎక్కువ... అని కూడా అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేయొచ్చు కదా? అని ప్రశ్నించగా ఇక్కడ దానికి చాలా మంది ఉన్నారు.. మంచి జరుగుతుంది.. అని విశాల్ అన్నారు. నేనెందుకు రాజకీయాల్లోకి రావడం.. ప్రజలకు సేవలు చేసే నేను ఆ పని చేస్తేనే సరైనది అని అన్నారు.