టాలీవుడ్ కి టైమిస్త లేదు
కన్నడలో సినిమాలు చేస్తూ అక్కడ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ అయ్యింది. అమ్మడు కన్నడలో నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా రుక్మిణితో ప్రేమలో పడిపోయారు. సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణిని చూసిన యువత అంతా కూడా ఆమే తమ ప్రేయసి అని ఊహించుకునేలా మెప్పించింది రుక్మిణి. సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీగా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రుక్మిణి మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలు చేసే ఆలోచనలో లేదన్నట్టు టాక్. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ను కేవలం పాటల కోసమే తీసుకుంటారు. అలాంటి సినిమాలకు రుక్మిణి దూరంగా ఉంటుంది. తెలుగులో కూడా తను నటించడానికి స్కోప్ ఉన్న సినిమా అయితేనే ఓకే చెప్పాలని చూస్తుంది. అందుకే సప్త సాగరాలు రిలీజ్ టైం లోనే ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా కాదనేసిందట రుక్మిణి. సినిమాల సెలక్షన్ విషయంలో రుక్మిణి అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. కథానాయికకు బలం ఉన్న సినిమాలనే చేయాలని కోరుతుంది. కమర్షియల్ సినిమాలు చేసినా అందులో కూడా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉండాలని భావిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్న రుక్మిణి వసంత్ తెలుగు ఎంట్రీ ఎప్పుడని ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. మరి అమ్మడు తెలుగులో మొదటి సినిమా ఏది సైన్ చేస్తుందా అన్నది చూడాలి. రవితేజ, విజయ్ దేవరకొండ సినిమాల్లో రుక్మిణి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరిలో రుక్మిణి ఓకే చెప్పే హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.