డీ స్టార్ బిజీగా మారాడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్.

Apr 17, 2024 - 16:16
 0
డీ స్టార్ బిజీగా మారాడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆటకే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుందని భావించారు.

వీకెండ్ మూడు రోజులు యూత్ ఎక్కువగా చూస్తారు కాబట్టి కొంత మిక్స్ డ్ టాక్ వచ్చిందని, ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని మూవీ చేశామని దిల్ రాజు చెప్పారు.  వీకెండ్ తర్వాత పండగల టైమ్ లో పరవాలేదు అనిపించినప్పటికి అనంతరం కలెక్షన్స్ అంతగా పికప్ కాలేదు. నెంబర్లు కంప్లీట్ గా డ్రాప్ అయిపోయాయి.

దీంతో విజయ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ చేరినట్లు టాక్ వస్తోంది. అయితే విజయ్ దేవరకొండ ఫెయిల్యూర్స్ వచ్చిన పెద్దగా వర్రీ కాడు. మూవీ డిజాస్టర్ అయ్యిందని బ్యాడ్ మూడ్ లో ఉండకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారంట. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ మూవీని వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలనే ఆలోచనతో విజయ్ దేవరకొండ ఉన్నారంట.

మూవీలో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పీరియాడిక్ జోనర్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూవీలో శ్రీలీలని హీరోయిన్ గా ముందు ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం ఆమె స్థానంలో మలయాళీ బ్యూటీ మమిత బైజు, బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో హీరోయిన్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.