ఉరకలెత్తే..‘కృష్ణమ్మ’
Urakalette..'Krishnamma'
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటుడు సత్యదేవ్. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో విభిన్నమైన కథాంశం ఉంటుంది అని అతని క్యారెక్టర్ కూడా చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని ఓ వర్గం ఆడియన్స్ లో మంచి నమ్మకం అయితే ఏర్పడింది. అలాగే అప్పుడప్పుడు కొన్ని పెద్ద సినిమాలలో అలాగే మీడియం రేంజ్ సినిమాలలో కూడా సత్యదేవ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు. ఎలాంటి పాత్ర చేసిన కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఈ నటుడు మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు. ఇక అప్పుడప్పుడు హీరోగా చేస్తున్న కొన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటున్నాయి. ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన సత్యదేవ్ ఈసారి ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా ఉండగా క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. మంచి సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను కృష్ణమ్మ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా మైత్రి వారి సపోర్ట్ లభించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. డిస్ట్రిబ్యూషన్ లో ఈ సంస్థకు ఇటీవల కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు కొరటాల శివ అండతో పాటు మైత్రి మద్దతు లభించడం సినిమాకు మంచి శకునం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ అతీరారాజ్ నటించారు. అలాగే లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘కృష్ణమ్మ’ మూవీకి సంబంధించిన టీజర్ ను కూడా ఇదివరకే రిలీజ్ చేశారు. అలాగే ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ అనే లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ గతంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. ఇక ఇప్పుడు అతను సరికొత్త కోణంలో ఆకట్టుకోవడానికి ‘కృష్ణమ్మ’ సినిమాతో రాబోతున్నాడు. ఇక సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫర్ వర్క్ చేస్తున్నారు.