సత్యేంద్ర బెయిల్​ నిర్ణయం తీసుకోవాలి

హైకోర్టుకు సూచించిన సుప్రీంకోర్టు

Jun 25, 2024 - 13:29
 0
సత్యేంద్ర బెయిల్​ నిర్ణయం తీసుకోవాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మనీలాండరింగ్​ కేసులో అరెస్ట్​ అయిన ఆప్​ మంత్రి సత్యేంద్ర జైన్​ బెయిల్​ పై జూలై 9లోపు నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారం ఆయన బెయిల్​ పిటిషన్​ ను సుప్రీం విచారించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో జైన్​ తరపు న్యాయవాది ఏఎం సింఘ్వి పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ ను సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్​ మనోజ్​ మిశ్రా, జస్టిస ఎస్వీఎన్​ భట్ లతో కూడిన బెంచ్ విచారించింది. అనవసరం బెయిల్​ ను వాయిదా వేయరాదని హైకోర్టుకు సూచించింది. 

తదుపరి హైకోర్టులో బెయిల్​ పిటిషన్​ విచారణకు వస్తే కోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. 
హైకోర్టు తదుపరి నిర్ణయం కోసం వేచి చూడాలని సత్యేంద్ర జైన్​ న్యాయవాది సింఘ్వికి సుప్రీం స్పష్టం చేసింది.