ఓటింగ్ పెరగడం సంతోషం
పీవోకే స్వాధీనం, రాష్ర్ట హోదాలపై త్వరలో నిర్ణయం లోయలో బీజేపీని విస్తరిస్తాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అనంత్ నాగ్ – రాజౌరీ 53 శాతం ఓటింగ్ జరగడం సంతోషకరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పీవోకే స్వాధీనం బీజేపీ మేనిఫెస్టోలో భాగమని అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన అంశమన్నారు. పీవోకే విలీనంపై ఉన్నతస్థాయి చర్చల అనంతరం నిర్ణయం తీసుకోగలమని షా పేర్కొన్నారు. ఆదివారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు.
కాశ్మీర్ విధానంపై కేంద్రం విజయవంతమైందన్నారు. జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదులు అత్యధికంగా ఓట్లు వేశారన్నారు. విజయం అనంతరం రెండు పనులు చేసేందుకు సిద్ధంగ ఉన్నామన్నారు. మొదటిది కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ర్ట హోదాను కల్పిస్తామన్నారు. రెండోది పీవోకే స్వాధీనమే అన్నారు. రాష్ర్ట హోదాను ఇస్తామని పార్లమెంట్ లో ప్రకటించామన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతామన్నారు. ఇప్పటికే డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అమిత్ షా తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే రిజర్వేషన్ ఇవ్వగలమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉందని తెలిపారు. సుప్రీం గడువు కంటే ముందే ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
లోయలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేదని భవిష్యత్తులో తమ అభ్యర్థులను నిలబెడుతుందన్నారు. బీజేపీని పూర్తి స్థాయిలో విస్తరిస్తామన్నారు.