ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Sep 18, 2024 - 12:08
 0
ఓటు హక్కు వినియోగించుకోవాలి

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లోని తొలిదశ ఓటింగ్​ జరగనున్న ప్రాంతాల్లోని ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు, వృద్ధులు, వికలాంగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.