వెలవెలబోతున్న సింగూరు

తగ్గిన నీటి ప్రవాహం.. ఆందోళనలో అన్నదాతలు

Aug 18, 2024 - 16:20
Aug 18, 2024 - 18:21
 0
వెలవెలబోతున్న సింగూరు

నా తెలంగాణ, సంగారెడ్డి: నిండికుండల సింగూరు ఈ యేట తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీరు లేక వెలవెలబోతోంది. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 14.897 టీసీల నీరే నిల్వ ఉంది. 

పూర్తిస్థాయిలో నీరు రా ప్రాజెక్టు రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పంటలకు నీరు విడుదల చేయడానికి రైతులకు రైతులు మొర పెట్టుకుంటున్నారు. 

సింగూరు పరివాహక ప్రాంతాలైన క్యాచ్ మెంట్ ఏరియాలలో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవలేదు. దీంతో రైతులు పంటలు పండేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సింగూరు నుంచి కూడా నీరు రాక కష్టాల్లో ఉన్నారు. పంటపొలాల్లో బోరుబావులు లేక చాలమంది రైతులు సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిపైనే పలురకాల పంటల సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగూరులో నీరు లేకపోవడం కూడా నీటి విడుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. మరి ప్రభుత్వం రైతుల పంటల కోసం నీరు ఏ విధంగా అందిస్తుందో అన్నది ప్రశ్నలా మారింది.