వాగ్ధానాలను నెరవేర్చుతా
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
నా తెలంగాణ, మెదక్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీటి రోడ్లకు మొత్తంగా రూ. 15 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో రోడ్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తానని తెలిపారు. ప్రాంత అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని పేర్కొన్నారు.