సర్దార్ సర్వాయి పోరాటం ఆదర్శనీయం
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
నా తెలంగాణ, సంగారెడ్డి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటపటిమ ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగింది.
ఈ ప్రముఖ అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, పరిశ్రమల మౌలిక వసతి సౌకర్యాల కల్పన చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుడిగా తన ప్రస్థానంలో అణచివేత, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడన్నారు. భూస్వాములను ఏకం చేసి మొగలు విధించిన శిస్తును వ్యతిరేకించిన తొలితరం తెలంగాణ వీరుడని కలెక్టర్ గుర్తుచేశారు.
పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల (టిజీఐఐసీ) చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దేశ చరిత్రలో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ తరువాతి తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు. సమానత్వంపై ఆయన ఐక్యతా పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ పద్మజ రాణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆశన్నగౌడ్, రమేష్ గౌడ్, నాయకులు ప్రభుగౌడ్, వివిధ సంఘాల నాయకులు కూన వేణు, మాణిక్యం, నగేష్ నిర్వహిస్తున్నారు. .